Monday, November 9, 2026
గొర్రెలు
ఆ నవ్వు వెనుక ఉన్న మాట
మీరు ఆ మాట వందసార్లు విని ఉంటారు. బహుశా మీరే అని కూడా ఉంటారు.
ఎవరో ఆదివారం శుభ్రమైన బట్టల్లో
చేతిలో పుస్తకంతో నడిచి వెళ్తారు.
ఆ మాట గాలిలా తేలిగ్గా బయటకు వస్తుంది:
గొర్రెలు.
రెండు నవ్వులు. ఎవరికీ నొప్పి లేనట్టే. అది ఒట్టి మాటే కదా.
నిజంగానే?
ఆ మాటతో కాసేపు ఉందాం.
ఆ మాటలో ఏం అర్ధం ఉంది?
వెంట నడిచేవాడు. ఆలోచించనివాడు. ఇట్టే నడిపించబడ గలిగేవాడు.
ఇప్పుడు నవ్వుతున్నవాళ్లను చూడండి.
అందరూ ఒకే క్షణంల. ఒకే జోక్కి. అది నిజంగా నవ్వాల్సిన విషయమా అని ఎవరూ అడగలేదు.
అసలు ఎవరు ఎవరి వెంట నడుస్తున్నారు?
ఒక విచిత్రం ఉంది.
ఈ మాటను వాడిన ఆ పుస్తకంలోని కథలో ఇది తిట్టు కాదు.
అందులో గొర్రెలు
సన్నిహితమైనవి. పేరు పెట్టి పిలవబడేవి. అలసిపోతే భుజాన మోయబడేవి. ఒక్కటి తప్పిపోయినా వెతికి తేబడేవి.
అదే కథలో ఇంకా కొద్దిమందే ఉన్నారు.
కాపరి.
దొంగ.
తోడేలు.
దొంగ దోచుకోవడానికి వస్తాడు. తోడేలు చెదరగొట్టడానికి వస్తుంది. వీళ్లలో ఎవరినీ ఎప్పుడూ గొర్రె అనరు. ఆ మాట వాటికి కుదరదు.
"ఆ నలుగురే ఈ సృష్టిలో ఉంటారు" అని ఆ పుస్తకం అంటున్నది.
మీకు కాపరి పేరు కుదరదు.
ఎందుకు? కాపరి ఆ గొర్రెలను పుట్టించిన వాడు.
మీరు నవ్విన ఆ పేరు మీకు వద్దు గదా!
మరి ఇంకేం పేర్లు మిగిలాయి?
మిగిలిన పేర్లు మీకు చెందవు కదా.
మీరు అదే అని నేను అనడం లేదు. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో ఒక్కసారి చూడమని మాత్రమే అడుగుతున్నాను.
ఆగి, ఆలోచించాలి.
ఇది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు.
ఒక నమ్మకంతో విభేదించడం నిజాయితీ.
మనిషిని వెక్కిరించడం వేరే విషయం.
ఎవరూ చెప్పని ఒక నష్టం కూడా ఉంది.
మీరు ఒక చల్లని చేతిని వదులుకుంటున్నారేమో!
ఒక విశాలమైన పూదోటను వద్దను కుంటున్నారేమో!
ఆ మాట నోటిలోనే ఆగదు. అది మనసులో స్థిరపడుతుంది.
రాత్రంతా మీ అమ్మ చేయి పట్టుకున్న నర్సు.
బడి వదిలాక కూడా ఆగి చెప్పిన టీచరు.
ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అన్నం తెచ్చిన పొరుగువాళ్లు.
ఆ బొట్టులేని ముఖాలు.
వాళ్లు ఒకరే.
వాళ్ళు మీలోని వారే.
మీరు వాళ్లను ఒక చిన్న కిటికీ గుండా చూడటం నేర్చుకున్నారేమో,
మీరు వాళ్లను మసక అద్దాల్లో చూస్తున్నారేమో.
అంతే.
సృష్టిని మోస్తున్న ఈ భూమికి తెలుసు.
వారు బతుకు బరువుని దించుకున్న సజీవులని.
సృష్టిని మోస్తున్న ఈ భూమికి తెలుసు.
ఆ మందను కాసేవాన్ని రాజాధిరాజులు నెత్తిన పెట్టుకున్నారు. కాపలా కాసేవాణ్ని, తప్పిపోయినదాని కోసం వెళ్లేవాణ్ని. ఎవరూ అతన్ని వెక్కిరించలేదు. ఆయనకు మందిరాలు కట్టారు. ఆయన ముందు మోకాళ్ళమీద నిల బడ్డారు. తల దించారు.
ఆ చిత్రంలో మీరు నవ్విన వారు ఉన్నారు.
పై దృశ్యానికీ, మీరు నవ్వుతున్న పేరుకీ కుదురు బాటు ఉందా ?
ఒకసారి ఆలోచించండి.
బహుశా సమస్య ఎప్పుడూ గొర్రె కాదేమో.
మీరు ఒప్పుకోవాల్సిన పనిలేదు.
ఈ రోజే మానాల్సిన పనీ లేదు.
కేవలం, ఆ మాట గొంతులోకి ఎగసి వచ్చే తదుపరిసారి, ఒక్క క్షణం ఆగండి.
ఆ నవ్వు లోపల నుంచి ఎలా వినిపిస్తుందో వినండి.
అది ఎవరి గొంతు?
Who Is The Intruder?
Who Is The Intruder?
You are walking in your own colony.
A speaker is playing a devotional song. Loud.
A procession is passing. The road is blocked.
Someone is asking for chanda for Ganesh Chavithi.
You do not call this illegal.
You call this culture.
Now imagine another evening.
Same colony.
Same road.
A man is standing quietly with a small pamphlet in his hand. No loud speaker. No road block. No chanda.
He says, “This is what I believe. You can take it, or leave it.”
Suddenly, you call this conversion. Fraud. Foreign conspiracy.
Pause there.
Just pause.
The same street that belongs to one prayer — does it not belong to another?
Think about the paradox we live in: We share the Bhagavad Gita freely — and that is called dharma pracharam.
They share a gospel pamphlet — and that is called forced conversion.
We ask a Christian shopkeeper for donation for Rama Navami — and that is called harmony.
They offer a pamphlet for free — and that is called a trap.
We play our songs on loudspeakers — and that is called devotion.
They speak softly on a street corner — and that is called an attack.
Is the difference in the act?
Or is the difference in who is doing it?
This is where the Constitution enters. Not as a book in Delhi. As a promise in your pocket.
Article 25 does not say: India is a Hindu country and others must live on permission.
It says:
Every person has the freedom to believe, to practise, and to propagate his religion.
Propagate does not mean force.
Propagate means: to tell. To inform. To place an option before a free mind.
A pamphlet cannot convert a man.
A packet of goodies cannot convert a man.
Only a man can convert himself — after he hears, thinks, and chooses.
If a pamphlet is powerful enough to “force” conversion, then why is the Gita not powerful enough to “force” reconversion?
Why do we fear a piece of paper more than we trust our own faith?
And here is the deeper intrusion:
If India is only for one faith, then who decides who is Indian?
The Christian who was born in Mallapur?
The Christian whose grandfather was buried in this soil? Is he an intruder in the land where his mother gave birth to him?
You believe he will ditch India for a foreign country.
But tell me — when the floods came, who gave blood? When the poor needed rice, who gave rice? Did the blood have a religion? Did the rice have a passport?
Attacking a man for sharing his faith is not protecting India.
It is shrinking India.
Because the moment we say, “You can live here, but you cannot speak here” — we have not protected the Constitution.
We have broken it.
So the question is not:
Is he allowed to share?
The question is:
Are we allowed to stop him, and still call ourselves free?
ఎవరు పరాయివారు?
నువ్వు నీ కాలనీలోనే నడుస్తున్నావు.
ఒక స్పీకర్ లో భక్తి పాట పెద్దగా వస్తుంది.
ఊరేగింపు పోతుంది.
రోడ్డు మూసేసారు.
గణేష్ చవితికి చందా అడుగుతున్నారు.
దీన్ని నువ్వు చట్టవిరుద్ధం అనవు.
దీన్ని నువ్వు సంస్కృతి అంటావు.
ఇప్పుడు ఇంకో సాయంత్రం ఊహించుకో.
అదే కాలనీ. అదే రోడ్డు.
ఒక మనిషి చేతిలో చిన్న పాంప్లెట్ తో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. స్పీకర్ లేదు. రోడ్డు బ్లాక్ లేదు. చందా లేదు.
అతను అంటాడు, “ఇది నేను నమ్మేది. తీసుకోండి, లేదా వదిలేయండి.”
వెంటనే నువ్వు దాన్ని మతమార్పిడి అంటావు. మోసం అంటావు. విదేశీ కుట్ర అంటావు.
అక్కడే ఆగు.
కాసేపు ఆగు.ఒక ప్రార్థనకు చెందిన రోడ్డు — ఇంకో ప్రార్థనకు చెందదా?
మనం బతుకుతున్న వైరుధ్యాన్ని చూడు:
మనం భగవద్గీత పంచితే — అది ధర్మ ప్రచారం.
వాళ్ళు సువార్త పాంప్లెట్ పంచితే — అది బలవంతపు మతమార్పిడి.
మనం రామ నవమికి క్రిస్టియన్ షాపు వాడిని చందా అడిగితే — అది సామరస్యం.
వాళ్ళు ఉచితంగా పాంప్లెట్ ఇస్తే — అది వల.
మనం స్పీకర్లలో పాటలు పెడితే — అది భక్తి.
వాళ్ళు రోడ్డు మూలన మెల్లగా మాట్లాడితే — అది దాడి.
తేడా ఆ పనిలో ఉందా?
లేక ఆ పని ఎవరు చేస్తున్నారో అందులో ఉందా?
ఇక్కడే రాజ్యాంగం వస్తుంది. ఢిల్లీలో ఉన్న పుస్తకంలా కాదు. నీ జేబులో ఉన్న హామీలా.
ఆర్టికల్ 25 చెప్పేది ఇది కాదు: “ఇండియా హిందూ దేశం, మిగతావాళ్ళు దయతో బతకాలి.”
అది చెప్పేది ఇది:
ప్రతి వ్యక్తికి నమ్మే స్వేచ్ఛ, ఆచరించే స్వేచ్ఛ, మరియు తన మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది.
ప్రచారం అంటే బలవంతం కాదు.
ప్రచారం అంటే: చెప్పడం. తెలియజేయడం. స్వేచ్ఛ ఉన్న మనసు ముందు ఒక అవకాశాన్ని పెట్టడం.
ఒక పాంప్లెట్ మనిషిని మార్చలేదు.
ఒక మిఠాయి ప్యాకెట్ మనిషిని మార్చలేదు.
మనిషి మాత్రమే తనను తాను మార్చుకోగలడు — విన్న తర్వాత, ఆలోచించిన తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత.
ఒక కాగితం ముక్కకే బలవంతంగా మార్చే శక్తి ఉంటే, మరి భగవద్గీతకు తిరిగి మార్చే శక్తి ఎందుకు లేదు?
మన సొంత విశ్వాసం మీద నమ్మకం కంటే, ఒక కాగితం మీద భయం ఎందుకు ఎక్కువ?
ఇంకా లోతైన ప్రశ్న:ఇండియా ఒక్క మతానికే అయితే, ఎవరు ఇండియన్ అని ఎవరు నిర్ణయిస్తారు?
మల్లాపూర్ లో పుట్టిన క్రిస్టియన్? తాత ఈ మట్టిలోనే పూడ్చబడిన క్రిస్టియన్? తల్లి ఈ నేల మీదే కన్న కొడుకు పరాయివాడు అవుతాడా?
వాడు ఏదో రోజు విదేశాలకు అమ్ముడుపోతాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ చెప్పు — వరదలు వచ్చినప్పుడు రక్తం ఎవరు ఇచ్చారు? పేదవాడికి బియ్యం ఎవరు ఇచ్చారు? ఆ రక్తానికి మతం ఉందా? ఆ బియ్యానికి పాస్ పోర్ట్ ఉందా?
తన విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాడని ఒక మనిషి మీద దాడి చెయ్యడం ఇండియాను కాపాడటం కాదు.
ఇండియాను చిన్నది చెయ్యడం.
ఎందుకంటే, “నువ్వు ఇక్కడ బతకొచ్చు, కానీ ఇక్కడ మాట్లాడకూడదు” అన్న క్షణంలో — మనం రాజ్యాంగాన్ని కాపాడలేదు.
దాన్ని విరగ్గొట్టాం.
కాబట్టి ప్రశ్న ఇది కాదు: తాను నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చా?
ప్రశ్న ఇది: వాడిని ఆపేసి, మనల్ని మనం స్వేచ్ఛా పరులం అని ఇంకా అనుకోగలమా?
Is Gospel Sharing to the Hindus Similar to an Abusive Ridicule of their Mother?
Is Gospel Sharing to the Hindus Similar to an Abusive Ridicule of their Mother?
The Wrong Comparison
You have heard it.
Maybe in a village meeting. Maybe on a road. Maybe in a video forwarded to you.
Someone says:
If someone comes from outside and says your mother is characterless, or your wife is characterless, will you keep quiet?
Then why do Christians come and say our religion is wrong?
You listen.
Something inside you tightens.
Because mother is mother. Wife is wife. No one touches that.
So you nod.
You feel angry.
You feel protected.
And the conversation stops there.
But wait.
Stay with that feeling for one more minute.
Not to argue. Just to look.
Close your eyes and see the scene again.
A stranger comes to your house.
He looks at your mother. He points his finger. He says, “She has no character.”
What is he doing?
He is judging a person. A living person. A person who fed you. A person who slept hungry for you.
Now see the second scene.
A stranger comes to your house.
He does not point at your mother. He does not point at your wife. He does not point at you.
He sits down. He says, “I have found something. I wanted you to hear it too. If you don’t
like it, you can leave it.”Are these two scenes the same?
Think slowly.
In the first scene, someone is insulting a person.
In the second scene, someone is sharing an idea.
One attacks a person’s character.
The other offers a thought about life, about sin, about God, about eternity.
Can an idea be insulted the way a mother can be insulted?
A mother bleeds when you wound her.
Does an idea bleed?
A wife cries when you slander her.
Does a belief cry?
You feel the difference, don’t you?
Your body knows it before your mind admits it.
That is the first crack in the comparison.
Now the second crack.
When someone says your mother is characterless, what does he want from you?
Nothing. He wants to hurt you. He wants to leave a wound and walk away.
When someone shares the gospel, what does he want from you?
He is not asking for your land. He is not asking for your money. He is not asking for your caste, your name, your position.
He is saying, “I was also lost. I also had restless senses. I also said Papoham, Papatma. And I found a way to turn. I wanted you to know.”
Is that hate? Or is that love that looks like hate because we are not used to it?
Think of a doctor.
A doctor says, “You have a disease.”
Do you slap the doctor and say, “You insulted my mother”?
No. You ask, “Is it true? What is the medicine?”
Because the doctor is not insulting you. He is diagnosing you.
Why do we allow a doctor to tell us a bitter truth about our body, but we do not allow anyone to tell us a bitter truth about our soul?
Is it because the body is ours, but the religion is also ours?
And if religion is ours, like a mother, then we must ask one more question.
A mother can be questioned?
No. A mother cannot be questioned about her character by a stranger.
But a religion — can it be questioned?
If a religion is true, it will not break when you question it. It will shine more.
If a religion is false, it will need protection. It will need anger. It will need laws. It will need crowds shouting.
Which one needs protection?
Truth does not need a bodyguard.
Lie needs an army.
So why does this comparison come up again and again?
Maybe it is not about protecting mother.
Maybe it is about protecting something else.
Maybe it is easier to say, “You insulted my mother,” than to say, “I don’t want to hear that I am a sinner and I need to turn.
”Because the first sentence makes you the hero.
The second sentence makes you the patient.
And no one likes to be the patient.
So the anger is not really about the mother.
The anger is about the mirror.
The gospel holds a mirror. The mirror says, “Papoham. Your senses are chanchala. Your consciousness is not pure. You need to turn.”
We do not like mirrors that show us our wound.
So we break the mirror. And we say, “You insulted my mother.”
But the wound remains.
And the hidden cost?
Here it is.
When you call every invitation an insult, you stop listening to anyone.
You stop hearing the doctor. You stop hearing the friend. You stop hearing the stranger who came with no weapon, only with a word.
You live safe.
You live protected.
You live with your pride intact.
But inside, the five senses keep pulling. The eyes keep wanting. The tongue keeps wanting. The skin keeps wanting.
And the soul keeps whispering, “Is this all?”
You silence that whisper by shouting louder outside.
But at night, when the house is quiet, when the mirror is in front of you, the whisper returns.
You know it returns.
You have felt it.
So ask yourself, not as a Hindu, not as a Christian, but as a human sitting alone:
If someone came to tell you that your mother is characterless, would he stay to eat with you? Would he sit with you when you are sick? Would he cry when you cry?
The gospel man does that.
He stays.
He does not come to take your mother away. He comes to tell you about a Father who will never leave you.
Is that an insult?
Or is that an invitation you have been taught to fear?
The door is still open.
You can close it.
Or you can ask one honest question:
What if he is not insulting my mother, but inviting my soul?
Leave that question there.
Do not answer it tonight.
Let it sit in you.
హిందువులకు యేసు ప్రభువు సువార్త చెప్పడం వారి తల్లిని దూషించినట్టా ?
తప్పు పోలిక
నీవు విన్నావు.
ఒక గ్రామ సభలో కావచ్చు. రోడ్డు మీద కావచ్చు. నీకు వచ్చిన వీడియోలో కావచ్చు.
ఎవరో అంటారు:
బయటి వాడు వచ్చి నీ తల్లి గురించి, నీ భార్య గురించి చెడ్డగా మాట్లాడితే ఊరుకుంటావా?
అలాగే క్రైస్తవులు వచ్చి మా మతం తప్పు అంటే ఊరుకుంటామా?
నీవు వింటావు.
లోపల ఏదో బిగుసుకుంటుంది.
ఎందుకంటే తల్లి అంటే తల్లి. భార్య అంటే భార్య. వాళ్ళని ఎవరూ ముట్టుకోకూడదు.
నీ పళ్లు వాటినే కొరుక్కుంటాయి.
నీ పిడికిళ్లు బిగుసు కుంటాయి.
కానీ మాటాడవ్.
కానీ ఆగు.
ఆ భావనతో ఇంకో నిమిషం ఉండు.
వాదించడానికి కాదు. చూడడానికి.
కళ్ళు మూసుకుని అలాంటి దృశ్యాన్ని మళ్ళీ చూడు.
ఒక అపరిచితుడు నీ ఇంటికి వస్తాడు.నీ తల్లిని చూస్తాడు. వేలు చూపిస్తాడు. “ఆమెకు శీలం లేదు” అంటాడు.
అతను ఏం చేస్తున్నాడు?
ఒక మనిషిని తీర్పు తీరుస్తున్నాడు. బతికి ఉన్న మనిషిని. నీకు అన్నం పెట్టిన మనిషిని. నీ కోసం ఆకలితో పడుకున్న మనిషిని.
ఇప్పుడు రెండో దృశ్యాన్ని చూడు.
ఒక అపరిచితుడు నీ ఇంటికి వస్తాడు.
నీ తల్లిని చూపించడు. నీ భార్యను చూపించడు. నిన్ను చూపించడు.
కూర్చుంటాడు. “నేను ఒకటి కనుక్కున్నాను. నీవు కూడా వినాలని వచ్చాను. నచ్చకపోతే వదిలేయి” అంటాడు.
ఈ రెండు దృశ్యాలు ఒకటేనా?
నెమ్మదిగా ఆలోచించు.మొదటి దృశ్యంలో, ఎవరో ఒక మనిషి శీలాన్ని అవమానిస్తున్నారు.
రెండో దృశ్యంలో, ఎవరో ఒక ఆలోచనను పంచుకుంటున్నారు.
మొదటిది ఒక వ్యక్తిని అవమానిస్తుంది.
రెండోది జీవితం గురించి, బతుకులో ఆటుపోట్ల గురించి. పాపం గురించి, దేవుని గురించి, మనశ్శాంతి గురించి. బందీ అయిన బతుకుని రక్షించడం గురించి ఒక మాట చెబుతుంది.
తల్లిని అవమానించినట్టు ఒక ఆలోచనను అవమానించగలవా?
తల్లిని గాయపరిస్తే రక్తం వస్తుంది.
ఆలోచనకు రక్తం వస్తుందా?
భార్యను నిందిస్తే కన్నీళ్ళు వస్తాయి.
నమ్మకానికి కన్నీళ్ళు వస్తాయా?
తేడా నీకు తెలుస్తుంది కదా?
నీ మనసు ఒప్పుకోక ముందే నీ శరీరానికి తెలుస్తుంది.
అదే ఈ పోలికలో మొదటి లోపం.
ఇప్పుడు రెండో లోపం.
నీ తల్లికి శీలం లేదని ఎవరైనా అంటే, అతనికి నీ నుంచి ఏం కావాలి?
ఏమీ లేదు. నిన్ను బాధపెట్టాలి. గాయం చేసి వెళ్ళిపోవాలి.
సువార్త చెప్పేవాడికి నీ నుంచి ఏం కావాలి?
నీ భూమి కావాలని అడగడు. నీ డబ్బు కావాలని అడగడు. నీ కులం, నీ పేరు, నీ హోదా అడగడు.
“నేను కూడా తప్పులు చేసిన వాడిని. మంచికి దూరంగా వెళ్లిన వాడిని. నా ఇంద్రియాలు కూడా చంచలమైనవే. నేను కూడా పాపోహం, పాపాత్మా అన్నాను. నాకు తిన్ననైన దారి దొరికింది. నీకు చెప్పాలని వచ్చాను” అంటాడు.
అది ద్వేషమా? లేక మనకు అలవాటు లేని ఒక ప్రేమ మాట ద్వేషంలా కనిపిస్తుందా?
ఒక వైద్యుడిని ఊహించుకో.
వైద్యుడు “నీకు రోగం ఉంది” అంటాడు.
నీవు వైద్యుడిని కొట్టి “నా తల్లిని అవమానించావు” అంటావా?
లేదు. “నిజమా? మందు ఏమిటి?” అని అడుగుతావు.
ఎందుకంటే వైద్యుడు నిన్ను అవమానించడం లేదు. నిన్ను పరీక్షిస్తున్నాడు.
మరి శరీరం గురించి చేదు నిజం చెప్పే వైద్యుడిని మనం ఒప్పుకుంటాం. ఆత్మ గురించి చేదు నిజం చెప్పేవాడిని ఎందుకు ఒప్పుకోము?
శరీరం మనది కాబట్టా? మతం కూడా మనది కాబట్టా?
మతం మనది, తల్లిలాంటిది అయితే, ఇంకో ప్రశ్న అడగాలి.
తల్లి శీలాన్ని అపరిచితుడు ప్రశ్నించకూడదు.
కానీ మతాన్ని ప్రశ్నించవచ్చా?
మతం నిజమైతే, ప్రశ్నిస్తే విరిగిపోదు. ఇంకా ప్రకాశిస్తుంది.
మతం అబద్ధమైతే, దానికి రక్షణ కావాలి. కోపం కావాలి. చట్టం కావాలి. అరిచే గుంపు కావాలి.
ఏది రక్షణ కోరుకుంటుంది?
సత్యానికి బాడీగార్డ్ అవసరం లేదు.
అబద్ధానికి సైన్యం కావాలి.
మరి ఈ పోలిక మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది?
బహుశా ఇది తల్లిని రక్షించడం గురించి కాదు.
బహుశా ఇంకో దానిని రక్షించడం గురించి.
“నీవు నా తల్లిని అవమానించావు” అని అనడం తేలిక.
“నేను పాపిని, నేను నన్ను నేను సంస్కరించుకోవాలి అని అనడం నాకు ఇష్టం లేదు” అని అనడం కష్టం.
ఎందుకంటే మొదటి మాట నిన్ను హీరోను చేస్తుంది.
రెండో మాట నిన్ను రోగిని చేస్తుంది.
ఎవరూ రోగిగా ఉండాలని అనుకోరు.
కాబట్టి కోపం నిజంగా తల్లి గురించి కాదు.
కోపం ఒక అద్దం గురించి.
సువార్త ఒక అద్దం పడుతుంది. ఆ అద్దం అంటుంది, “పాపోహం. నీ ఇంద్రియాలు చంచలమైనవి. నీ చైతన్యం పవిత్రమైనది కాదు. ఇదిగో ఇదే నిన్ను రోగిని చేస్తున్న ఉచ్చు. నిన్ను నీవు సంస్కరించుకోవాలి (repent)” అని.
గాయాన్ని చూపించే అద్దం మనకు నచ్చదు.
అందుకే అద్దాన్ని పగలగొడతాం. “నా తల్లిని అవమానించావు” అంటాం.
కానీ గాయం అలాగే ఉంటుంది.
ఇలాగే ఉంటే, నువ్వు దేనికి తిలోదకాలిస్తున్నావ్?
ఇదే.
ప్రతి ఆహ్వానాన్ని అవమానం అని అంటే, నీవు ఎవరి మాటా వినడం మానేస్తావు.
వైద్యుడి మాట వినవు. స్నేహితుడి మాట వినవు. ఆయుధం లేకుండా, కేవలం ఒక మాటతో వచ్చిన అపరిచితుడి మాట వినవు.
నీవు సురక్షితంగా బతుకుతావు. రక్షించబడి బతుకుతావు. నీ అహం చెక్కుచెదరకుండా బతుకుతావు.
కానీ లోపల, ఐదు ఇంద్రియాలు లాగుతూనే ఉంటాయి. కళ్ళు కోరుతూనే ఉంటాయి. నాలుక కోరుతూనే ఉంటుంది. చర్మం కోరుతూనే ఉంటుంది. సంతోషం గోరంత. ఇంద్రియాల ఉచ్చు లో పడ్డావ్.
అందుకే ఎదో ఎక్కడో కొరుకుతూ ఉంటుంది.
ఆత్మ నిన్ను తప్పు పడుతూనే తూనే ఉంటుంది, “ఇంతేనా?” అంటూ.
బయట గట్టిగా అరిచి ఆ సణుగుల్ని నొక్కేస్తావు.
కానీ రాత్రి, ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, అద్దం ముందు ఉన్నప్పుడు, ఆ సణుగుడు మళ్ళీ వస్తుంది. ఎంతగా మేపినా, చాలు అనని ఇంద్రియాలు
అది వస్తుందని నీకు తెలుసు.
నీవు దాన్ని అనుభవించావు.
కాబట్టి ఒక ప్రశ్న అడుగు. హిందువుగా కాదు. క్రైస్తవుడిగా కాదు. ఒంటరిగా కూర్చున్న మనిషిగా:
నీ తల్లికి శీలం లేదని చెప్పడానికి వచ్చినవాడు నీతో కలిసి భోజనం చేస్తాడా? నీవు జబ్బుతో ఉన్నప్పుడు నీ దగ్గర కూర్చుంటాడా? నీవు ఏడ్చినప్పుడు ఏడుస్తాడా?
సువార్త చెప్పేవాడు అలా చేస్తాడు.
అతను ఉండిపోతాడు.
అతను నీ తల్లిని తీసుకెళ్ళడానికి రాలేదు. నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టని తండ్రి అయిన దేవుని గురించి చెప్పడానికి వచ్చాడు.
అది అవమానమా?
లేక నిన్ను భయపెట్టే ఆహ్వానమా?
తలుపు ఇంకా తెరిచే ఉంది.
నీవు దాన్ని మూసేయవచ్చు.
లేదా ఒక నిజాయితీ గల ప్రశ్న అడగవచ్చు:
అతను నా తల్లిని అవమానించడం లేదు, నా ఆత్మను ఆహ్వానిస్తున్నాడేమో?
ఆ ప్రశ్నను అలాగే వదిలేయి.
ఈ రాత్రి దానికి సమాధానం చెప్పకు.
అది నీలో ఉండనీ.
Subscribe to:
Posts (Atom)